AP: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు. దీనిపై తాజాగా మంత్రులతో జరిగిన టెలికాన్ఫరెన్సులో సీఎం సంకేతాలిచ్చారని విస్తృత ప్రచారం జరుగుతోంది. వచ్చే స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి కేబినెట్‌లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.