సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు: సీఎం చంద్రబాబు

AP: ఒకప్పుడు తాను సెల్ ఫోన్ల గురించి మాట్లాడితే ఎగతాళి చేశారని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ వచ్చిందని వ్యాఖ్యానించారు. భార్య లేదా భర్త లేకపోయినా ఉండగలరేమో కానీ.. సెల్ ఫోన్ లేకపోతే మాత్రం ఎవరూ నిమిషం కూడా ఉండలేకపోతున్నారని ప్రజలను ఉద్దేశించి ఆయన చమత్కారంగా మాట్లాడారు. నేటి డిజిటల్ యుగంలో ఫోన్ల ప్రాధాన్యతను చెబుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి.

సంబంధిత పోస్ట్

✕
✕