AP: మంత్రి అచ్చెన్నాయుడుకి వైసీపీ సవాలు విసిరింది. 'ఎక్స్ లో ఇలా మాట్లాడటం ఎందుకు అచ్చెన్నాయుడు ప్లేస్ నువ్వు చెప్తావా? మమ్మల్ని చెప్పమంటావా? టైం నువ్వు చెప్తావా? మమ్మల్ని చెప్పమంటావా? నీతో చర్చకు మా పార్టీ నేతలు రెడీ. ఇంతకీ నువ్వు సిద్ధమా? ఈ సారైనా వస్తావా? పారిపోతావా?' అంటూ ట్వీట్ చేసింది. 'జగన్ 5 ఏళ్ల మోసపు పాలన VS కూటమి 18 నెలల అభివృద్ధి పాలన' అంటూ అచ్చెన్న చేసిన ట్వీటు చేయడంతో పైవిధంగా వైసీపీ స్పందించింది.