వైసీపీ హయాంలో కాల్వల నిర్వహణ పనుల పట్టించుకోలేదు: మంత్రి నిమ్మల

AP: వైసీపీ హయాంలో కాల్వల నిర్వహణ పనులు కూడా పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పంట కాల్వలు, డ్రెయిన్ల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం రూ.344 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కాల్వల నుంచి మట్టి, తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టామని, ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్