AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 39 లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ స్క్రీనింగ్‌లో భాగంగా, 9,963 మందికి బ్రెస్ట్ క్యాన్సర్, 22,861 మందికి సర్వైకల్ క్యాన్సర్, 26,639 మందికి నోటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారికి ఆరు నెలల్లోగా స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి పేర్కొన్నారు.