AP: గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లతో సమాజానికి ప్రమాదం పొంచి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గిద్దలూరులో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల ప్రజలందరూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొందరు రౌడీలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను తయారు చేస్తూ సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి శక్తులు పెరిగితే ఆడబిడ్డలకు, ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.