రాజధాని రైతులను వైసీపీ హయాంలో హింసించారు: పవన్

ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఇప్పటికీ రాజధాని కోసం పోరాడటం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం అవసరమని చెప్పారు. అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని, గతంలో వైసీపీ వారిని ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్