AP: రాజధాని విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన తాజా వ్యాఖ్యలతో అమరావతి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశమే ప్రధాన అజెండాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ వైఖరిపై టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తూ, మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుందని ఆరోపిస్తోంది. మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం అమరావతి అంశం పరిమిత ప్రాంతానికే ప్రభావం చూపుతుందని, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ అంశాలే ఎన్నికల్లో కీలకమవుతాయని భావిస్తున్నాయి. దీంతో రానున్న ఎన్నికల్లో అమరావతి కేంద్రంగా రాజకీయ పోరు మరింత ఉత్కంఠగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.