కారు, టిప్పర్ ఢీ.. ఇద్దరి మృతి

AP: అనకాపల్లి జిల్లా, నర్సీపట్నంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. గురుకుల పాఠశాల సమీపంలో కారు, టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న నర్సీపట్నం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టౌన్ సీఐ గఫూర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕