AP: గుంటూరులోని ఐపీడీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. డయాలసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లి, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇంటికి తిరుగు ప్రయాణమైన తండ్రీకొడుకులు కారులో మంటలు చెలరేగడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో తాడికొండ హరికృష్ణ అనే వృద్ధుడు సజీవదహనమవగా, ఆయన కుమారుడు అఖిలేష్ గాయాలతో బయటపడ్డారు. కారులోని ఏసీ పేలడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.