AP: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం, గుర్రకొండవాండ్ల గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో చంద్రగిరి మండలం, రవణప్పగారిపల్లె వద్ద కారు ముందు వెళుతున్న టిప్పర్ను వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ చంద్రగిరి లక్ష్మీనారాయణ(31), అతని తండ్రి సిద్ధయ్య(65), బంధువు కుప్పాల రజని(55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ప్రయాణికుడు సుబ్రమణ్యం(67)కు గాయాలవ్వగా, అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.