పొలాల్లోకి దూసుకెళ్లిన కారు (వీడియో)

AP: కాకినాడ జిల్లాలోని గండేపల్లి వద్ద శనివారం 216వ నంబర్ జాతీయ రహదారిపై ఒక కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తుని నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్