ట్రాక్టర్‌ని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

AP: నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పగలడంతో అదుపుతప్పిన కారు, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕