వరద నీటిలో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురి మృతి

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. నంబూరులోని ఓ పాఠశాలలో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో రాఘవేంద్రతోపాటు కారులో ఉన్న విద్యార్థులు సాత్విక్‌, మానిక్‌లు మృతిచెందారు. స్థానికుల సాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్