AP: డీఎస్సీ నిరసన నేపథ్యంలో వైసీపీ నేతలకు బిగ్ షాక్ తగిలింది. విజయవాడలో 250 మందికిపైగా వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ విద్యార్థి నాయకుడు రవిచంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు. 2021లో మంగళగిరి టీడీపీ ఆఫీస్ దాడి కేసులో 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. దేవినేని అవినాష్ సహా 51 మంది పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ ద్వారా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు.