వైసీపీ మాజీ ZP ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక భర్త రాముపై కేసు

AP: వైసీపీ మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికకు సోమవారం బిగ్ షాక్ తగిలింది. ఆమె భర్త రాముపై గుడివాడ వన్‌ టౌన్‌ PS లో కేసు నమోదైంది. టీడీపీ మహిళా నేత సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నాగవరప్పాడు వంతెన వద్ద సునీతను ఉప్పాల హారిక కారు ఢీకొట్టింది. గాయపడిన సునీత సమీప ఆస్పత్రిలో చేరారు. కారు ఢీకొన్న సమయంలో వాహనంలో ఉన్న రాము, వైసీపీ కార్యకర్తలు తనను అసభ్యంగా దూషించారని సునీత ఆరోపించారు.

సంబంధిత పోస్ట్