రఘురామను అడ్డుకున్న కేసు.. 21 మంది అరెస్ట్

AP: శ్రీరామనవమి వేళ పశ్చిమ గోదావరి జిల్లా పెదపేటలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రామాలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును కొందరు అడ్డుకున్నారు. ఈ కేసులో పోలీసులు 21 మందిని అరెస్ట్ చేశారు. మరో 36 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఈ మేరకు పెదపేట రామాలయం వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్