మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

AP: నెల్లూరు జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు గౌరవానికి భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేశారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారని వెంకటాచలం మండల టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆయన చర్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్