టీటీడీ మాజీ చైర్మన్ భూమనపై కేసు నమోదు

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమనపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి, ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, భూమనపై గతంలో పలు కేసు నమోదైన నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్