బంగారుపాళ్యంలో జగన్‌ పర్యటనపై కేసు నమోదు

AP: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్‌ పర్యటనపై కేసు నమోదైంది. వైసీపీ నేతలైన సునీల్‌, కుమార్‌రాజా, రామచంద్రారెడ్డి, గజేంద్ర, కిషోర్‌ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జగన్‌ పర్యటన సందర్భంగా విధించిన నియమాలు, షరతులను ఉల్లంఘించిన కారణంగా వీరిపై చర్యలు తీసుకున్నారు. భారత న్యాయ విధానంలో కొత్తగా అమలులోకి వచ్చిన BNS చట్టంలోని సెక్షన్ 223, 126(1) r/w 3(5) ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్