విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుకు శనివారం వైసీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ నిరసనల సందర్భంగా తమపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. అమాయకులపై సెక్షన్ 307 సహా అక్రమ కేసులు పెట్టారని, దాడికి పాల్పడిన టీడీపీ వారిపై చర్యలు లేవని విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కేసులు పెట్టడం సరికాదని, మంత్రి నారా లోకేశ్‌పై కూడా రౌడీషీట్ తెరవాలని ఆయన వ్యాఖ్యానించారు.