అంగన్‌వాడీ టీచరు బ్యాంకు ఖాతాలో నగదు మాయం

AP: చిత్తూరు జిల్లా కుప్పం మండలం వానగుట్టపల్లిలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న మునీంద్రకు గత నెల 30న వాట్సప్‌లో పీఎం కిసాన్ పేరుతో ఒక సందేశం వచ్చింది. ఆమె దాన్ని పొరపాటున ఓపెన్ చేయగానే మొబైల్ ఫోన్ పనిచేయకుండా పోయింది. బుధవారం జీతం డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్‌కి వెళ్లగా, ఖాతాలో డబ్బులేదని సిబ్బంది చెప్పారు. ఆ సమయంలో ఆమెకు షాక్‌తో రూ.4 లక్షలు మాయమైపోయిన విషయం తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్