AP: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కుల రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల కాపు, శెట్టి బలిజ సామాజిక వర్గాల సమావేశాలు జరిగాయి. కాపు వర్గం, ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ అంశాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై కాపు వర్గంలో అసంతృప్తి వ్యక్తమైంది. శెట్టిబలిజ కుల సంఘం నాయకులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. బీసీలపై నమోదైన కేసులను తొలగించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో గోదావరి జిల్లాల్లో కుల రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి.