తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: CBN

AP: తిరుమల లడ్డూ తయారీలో నకిలీ నెయ్యి వినియోగంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గురువారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ, ఈ కమిటీ ముందు అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని, తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమపై ఆరోపణలు చేస్తున్నారని, దుర్మార్గాలు చేసి ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్