CCTV: ఏపీలో టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం

AP: అనకాపల్లి (D), నక్కపల్లి (M), కాగిత టోల్ ప్లాజా వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి కాకినాడ వైపుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి, టోల్ ప్లాజా వద్ద ఉన్న మొదటి కౌంటర్‌ను దాటి రెండో కౌంటర్‌కి దూసుకెళ్లింది. అంత పెద్ద లారీ వచ్చి ఢీకొనడంతో అక్కడ సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్