AP: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టం-2023ను పునఃసమీక్షించాలని, ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాలపై స్పష్టత ఇవ్వాలని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని ఆయన శనివారం 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ల మధ్య విబేధాలు, ఓటర్ల జాబితాపై ఆరోపణల నేపథ్యంలో ఈ చట్టాన్ని తక్షణమే సమీక్షించాలన్నారు. దీనిపై టీఎంసీ ఎంపీ మహువా ఘాటుగా స్పందిస్తూ, గతంలో ఈ చట్టానికి వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.