AP: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఈనెల 10వ తేదీ వరకు పొడిగించింది. ప్రజలు, రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ గడువు పొడిగింపుతో ఓటర్ల క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలన ప్రక్రియకు అక్టోబర్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. పూర్తి పరిశీలన అనంతరం అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు అధికారులు వెల్లడించారు.