ఏపీకి కేంద్ర పథకాలను ఎక్కువగా తీసుకురావాలని, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైసీపీ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఏపీ అడుగులేస్తోందని, అందుకే పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. విశాఖలో ఒక గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందని, సుపరిపాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.