AP: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై గణాంకాలు, వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు వరద జలాల వినియోగానికి అని ప్రభుత్వం అంటోంది. ఈ తరుణంలో వరద జలాల నిర్వచనం? వాటిని ఎలా లెక్కిస్తారో చెప్పాలని కేంద్ర జల సంఘం ప్రశ్నించింది. కాగా, ఈ ప్రశ్నలకు జవాబులతో వచ్చే వారం ఇరిగేషన్ అధికారులను ఢిల్లీకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.