AP: నోషనల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం చేపట్టిన ‘చలో విజయవాడ’ ఉద్రిక్తంగా మారింది. విజయవాడకు తరలివచ్చిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం 2,445 పదోన్నతి, అప్‌గ్రేడ్ పోస్టులను సృష్టిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిరసనకారులపై పోలీసుల చర్యను వైఎస్సార్‌సీపీ ఖండించింది.