అత్యంత తీవ్ర తుఫాన్ కు ఛాన్స్: APSDMA

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి, ప్రస్తుతం విశాఖకు 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్లు, బాపట్లకు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని SDMA తెలిపింది. ఇది ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారి, రేపు ఉదయానికి తుఫానుగా రూపాంతరం చెందుతుందని అంచనా. ఎల్లుండి తీవ్ర తుఫానుగా, ఆపై అత్యంత తీవ్ర తుఫానుగా బలపడి, బుధవారం విశాఖ-బాపట్ల మధ్య తీరం దాటవచ్చని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕