AP: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా మారడంతో ఈ మార్పులు సంభవిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.