AP: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి రేపు (శనివారం) రాత్రి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు కొనసాగే ఈ పర్యటనలో, నారా భువనేశ్వరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ -2025, ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌లో హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పీకాక్ అవార్డులను అందుకోనున్నారు. వ్యక్తిగత పర్యటన అనంతరం, సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్చలు జరపనున్నారు.