పవన్‌కు ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు, లోకేశ్

AP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ‘రాష్ట్రాభివృద్ధికి, కూటమి పక్షాల ఐక్యతకు మీ సహకారం అభినందనీయం. నాకు తోడుగా మీ వంటి ప్రజానేతలు కలిసివస్తే ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్రానికి, దేశానికి ఎంతటి మేలు జరుగుతుందో గత 20 నెలల పాలనే నిదర్శనం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి స్ఫూర్తిని వివరించిన పవనన్నకు కృతజ్ఞతలని మంత్రి లోకేశ్ అన్నారు.

సంబంధిత పోస్ట్