AP: విజయనగరంలో ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్ లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన మాట నిలుపుకోలేదని, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ఓడ దాటకముందు వాడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా కూటమి ప్రభుత్వం తయారైందని విమర్శించారు.