ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనను పరుగులు తీయిస్తున్నారు. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న లోటుపాట్లను పరిశీలించి అవి తమ ప్రభుత్వంలో తలెత్తకుండా జాగ్రత్తగా అమలుచేసుకుంటూ వస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రైతులకు సూక్ష్మ సేద్య పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా అన్నదాతల కోసం మరో నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ఈ-పంటలో నమోదైన రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేస్తోంది.