తిరుమల భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు: జగన్

AP: నెయ్యిలో జంతువుల కొవ్వు కలవకపోయినా తమపై కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేశారని జగన్ ధ్వజమెత్తారు. తిరుమల భక్తుల మనోభావాలను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని విమర్శించారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని, కేంద్రానికి సంబంధించిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబులే నివేదికలు ఇచ్చాయని గుర్తు చేశారు. లడ్డూ, నెయ్యి శాంపిల్స్ ను సీబీఐ ఆధ్వర్యంలో పరీక్షించగా ఎలాంటి కల్తీ లేదని నివేదికలు వెల్లడించాయని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ లెంపలేసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్