సీఎం చంద్రబాబు తన కబంధ హస్తాల్లో పోలీస్ వ్యవస్థను బంధించారని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. వేటాడే పులిలా ఉండాల్సిన పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కర్ పులిని చేశారన్నారు. కూటమి నేతలు పోలీసులపై ప్రత్యక్షంగా భౌతిక దాడులకు దిగుతున్నా పట్టించుకునే వారే లేరని మండిపడ్డారు. నిన్న ఏఆర్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి శిక్షించాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.