చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు: YS జగన్

AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు దేవుడంటే భక్తి, భయం లేదని, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీబీఐ సిట్ నివేదికను తమపైకి మళ్లించారని ఆరోపించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, ఆయన తనయుడు ప్రచారం చేసి శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశమే ఉందని, కులాలను, మతాలను రెచ్చగొడుతున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్