AP: చంద్రబాబు అమరావతిని ట్రిపుల్ ఏటీఎంలా మార్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం గుంటూరులో మాట్లాడుతూ అమరావతిపై రూ.47వేల కోట్లు అప్పు చేశారని, భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల్ని వేధిస్తున్నారని ఆరోపించారు. రైతు పరిరక్షణ కమిటీపై టీడీపీ గూండాల దుశ్చర్య రాష్ట్రమంతా చూసిందని, కానిస్టేబుల్‌పై దాడికి పోలీసులు, టీడీపీ దుష్టశక్తులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.