AP: గుంటూరులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. అంబటి మాట్లాడుతూ.. ‘చంద్రబాబును తిట్టాల్సిన అవసరం నాకు లేదు. నన్ను తిట్టినవారిని తిట్టాను. చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చింది. నన్ను అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు.. నీ సంగతి తేలుస్తా? నేను పారిపోను. ఇంట్లోనే ఉంటా. వచ్చి అరెస్ట్ చేసుకోండి’ అని అంబటి అన్నారు.