రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు: మాజీ మంత్రి రోజా

AP: సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. అలాగే 30 లక్షల మంది తల్లులకు ‘అమ్మఒడి’ పథకాన్ని దూరం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించిన రోజా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్