AP: సీఎం చంద్రబాబు పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ5 రిపోర్టర్ కోసం ఆయన ఫోన్ చేస్తాడన్నారు. కానీ రాష్ట్రంలో మహిళలపై హత్యాచారాలు జరుగుతుంటే కనీసం పరామర్శించడు. జగన్ చిత్తూరు పర్యటనకు వస్తున్నారని తెలియగానే మార్కెట్ యార్డులోకి ఒక్క మామిడికాయల ట్రక్కు కూడా రానీకుండా చేశారు. అలాంటప్పుడు రైతులు మామిడికాయలను పారబోసిందెక్కడ? ఎల్లో మీడియా రిపోర్టర్లు వీడియోలు తీసింది ఎక్కడ? రిపోర్టర్ కు దెబ్బలు తగిలింది ఎక్కడ? అని ప్రశ్నించారు.