దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం.. అధికారులపై చంద్రబాబు ఆగ్రహం

AP: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను సకాలంలో పరిష్కరించడం లేదని, కేవలం 50 శాతం కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 వేలకు పైగా దరఖాస్తులకు కేవలం 1200 మాత్రమే పరిష్కారం చూపడంపై ఆయన కలెక్టర్లను, మంత్రులను నిలదీశారు. ముఖ్యంగా రెవెన్యూ, 22ఏ అసైన్డ్ భూముల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్