AP: చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే ఏపీలోనే ఇంధన ధరలు అధికం. సూపర్ సిక్స్ అనేదే మోసం. హామీలపై ప్రశ్నిస్తే గొడ్డలి పార్టీ అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.