AP: తాడేపల్లిలోని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. గూగుల్ విషయంలో చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేశారని, మెడికల్ కాలేజీల విషయంలో కూడా చెడు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చామని గుర్తు చేశారు.