AP: CM చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబే అసలు విలన్ అని, సినిమాల్లోని విలన్ల పనులు ఆయన కళ్ల ముందే జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. అమరావతిలో రైతుల తరఫున నిలబడితే తమను నిందితులుగా చిత్రీకరిస్తున్నారని, తమ పార్టీ నేతలపైనే దాడి చేసి, తమపైనే కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. పోలీసుల సమక్షంలోనే తమపై రాళ్లతో దాడి చేశారని, కార్ల అద్దాలు పగలగొట్టారని జగన్ ఆరోపించారు.