చంద్రబాబుకు రైతుల కష్టాలు బాగా తెలుసు: మంత్రి లోకేశ్

AP: రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబుకు రైతుల కష్టాలు బాగా తెలుసని మంత్రి లోకేశ్ అన్నారు. 1997లోనే ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి రైతులకు చంద్రబాబు పరిచయం చేశారు. ఆంగ్ల పత్రికలో చంద్రబాబును వాటర్ మ్యాన్‌గా రాస్తే.. గొడ్డలి పార్టీ ఓర్చుకోలేకపోయిందన్నారు. రాయలసీమ గడ్డలోనే యువగళం పాదయాత్ర ప్రారంభించిందని తెలిపారు. తాను పాదయాత్ర చేస్తుంటే బాటిళ్లు, కోడిగుడ్లు విసిరారన్నారు. రాయలసీమ ప్రజల ఆశీస్సులతోనే పాదయాత్ర చేయగలిగామన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕