సురేశ్‌ కుటుంబానికి సాయం.. చంద్రబాబు ఆదేశాలు

ఒమన్ తీరంలో అమెరికా దాడిలో విశాఖకు చెందిన సురేశ్ పట్నాల మృతి చెందడంపై CM చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తరలించేందుకు భారత, ఒమన్ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ మేరకు ఏపీ భవన్ అధికారులు రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్