పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా తణుకులో పర్యటించిన చంద్రబాబు స్థానిక ఎన్టీఆర్‌ పార్క్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించి పారిశుద్ధ్యం మెరుగునకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు వెంట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, నారాయణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్